Pooja Paddathi(Telugu)
అచమనము, ప్రాణాయామములను చేసి భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణస్య నిర్మాల్య విసర్జనం కరిష్యే – అని సంకల్పము చెయ్యవలెను.
నారాయణాయ పరిపూర్ణగుణార్ణవాయ విశ్వోదయస్థితి లయోన్నియతి ప్రదాయ జ్ఞానప్రదాయ విభుదాసురసౌఖ్యదుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే
యో విప్రలంబ విపరీత మతిప్రభూతాన్ వాదాన్నిరస్య కృతవాన్ భువి తత్వ వాదం సర్వేశ్వరో హరిరితి ప్రతిపాదయంతం ఆనందతీర్థమునివర్యమహం నమామి
ద్వారపాలకులకు నమస్కారము
ఓం శ్రీయై నమః జయాయ నమః విజయాయ నమః
ఓం శ్రీయై నమః బలాయ నమః ప్రబలాయ నమః
ఓం శ్రీయై నమః నందాయ నమః సునందాయ నమః
ఓం శ్రీయై నమః కుముదాయ నమః కుముదాక్షాయ నమః
తారతమ్య స్తోత్రం
వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం
దేవీం వందే సుపర్ణిమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్ మద్గురూంశ్చ.
ఓం వాయ వాయాహి దర్శతమే సోమా అరం కృతాః తేషాం పాహి శృధీహవం
దీపప్రజ్వలనం
ఓం అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాడ్ జుహ్వాస్యః
ఓం అపసర్పంతు యే భూతా యే భూతా భువిసంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా
అపక్రామంతు తే భూతాః క్రూరాశ్చైవ తు రాక్షసాః
యే చాత్ర నివసంత్యేవ దైవతా భువి సంతతం
భూతప్రేతపిశాచా యే యే చాన్యే భువి భారకాః
తేషామప్య విరోధేన బ్రహ్మకర్మ సమారభే
యేభ్యో మాతా మధు మత్ పిన్వతే పయః పీయూషం ద్యౌరదితి రద్రి బర్హాః ఉక్థశుష్మాన్ వృషభరాం త్స్వప్నసస్తాం ఆదిత్యాం అనుమదా స్వస్తయే
ఏవాపిత్రే విశ్వదేవాయ వృష్ణే యజ్ఞైర్విధేమ నమసా హవిర్భిః బృహస్పతే సుప్రజా వీరవంతో వయం స్యామ పతయో రయీణాం
బ్రహ్మపార స్తోత్రం
ప్రచేతస ఊచుః
బ్రహ్మపారం మునే శ్రోతుమిచ్చామః పరమం స్తవం
జపతా కండునా దేవో యేనారాధ్యత కేశవః
సోమ ఉవాచ
పారం పరం విష్ణురనంత పారః పరః పరణామపి పారపారః
స బ్రహ్మపారః పరపారభూతః పరః పరేభ్యః పరమార్థరూపీ
స కారణం కారణతస్తతోఽపి తస్యాపి హేతుః పరహేతుహేతుః
కార్యేషుచైవం స హి కర్మకర్తృరూపైరశెషైరవతీహ సర్వం
బ్రహ్మ ప్రభుర్బ్రహ్మస సర్వభూతో బ్రహ్మప్రజానాం పతిరచ్యుతోఽసౌ
బ్రహ్మావ్యయం నిత్యమజం స విష్ణురపక్షయాద్యైరఖిలైరసంగీ
బ్రహ్మాక్షరమజం నిత్యం యథాసౌ పురుషోత్తమః
తథా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రశమం మమ
య ఏతద్ బ్రహ్మపారాఖ్యం సంస్తవం పరమం జపన్
అవాప పరమాం సిద్ధిం స సమారాధ్య కేశవం
ఘంటావాదనం
ఆగమార్థం తు దేవానాం గమానార్థం తు రక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
అజ్ఞానాద్ జ్ఞానతో వాపి కాంస్య ఘంటాన వాదయేత్
రాక్షసానాం పిశాచానాం తద్దేశీ వసతిర్భవేత్
తస్మాత్ సర్వ ప్రయత్నేన ఘంటామాచల్య వాదయేత్
కృతాంజలి పుటో భూత్వా వినయానత కంధరః
యాచే త్వాం దేవపూజార్థ ముత్తిష్ఠత్వం రమాపతే
నిర్మాల్య విసర్జనం
(అంగుష్టము మరియు తర్జనీ వేళ్ళతో కిందటి దినము అర్పించిన గంధము, తుళసి, పుష్పములను తీసి సంపుటములో ఉన్న సాలగ్రామము మరియు దేవుని ప్రతిమలను స్నానపాత్రలో (తామ్ర తట్ట) పెట్టవలెను.)
ఆయతాభ్యాం విశాలాభ్యాం శీతలాభ్యాం కృపానిధే
కరుణామృత పూర్ణాభ్యాం లోచనాభ్యాం విలోకయ
సాలగ్రామ నివాసాయ క్షీరాబ్ది శయనాయ చ
శ్రీశైలాద్రి నివాసాయ శిలావాసాయ తే నమః
సాలగ్రామ శిలాయం తు నిత్యం సన్నిహితః కలిః
భీమసేన మహాబాహో గదయా పోతనం కురు
(పై మంత్రములతో సాలగ్రామములను కడిగి అభిషేక పాత్రలో మళ్ళి పెట్టవలెను)
నిర్మాల్య అభిషేక :
(ఒక కలశము నీళ్ళను పంచపాత్రలో వేసుకొని తుళసీ దళము వేసి “ఓం నమో నారాయణాయ ఓం” అని ౧౨ సార్లు అభిమంత్రించి అంభృణీసూక్తము పఠిస్తూ శంఖముతో (ముత్తు హవళము కట్టినచో ముంభాగమునుంచి లేకపోతే పక్కనుంచి) అభిషేకము చెయ్యవలెను. సాలగ్రామము జతగా సుదర్శనము, చక్రాంకితము, విష్ణుపాదము, కృష్ణ ప్రతిమలకూ అభిషేకము చెయ్యవలెను)
అంభృణీసూక్తం
అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్ యైరుత విశ్వదేవైః . అహం మిత్రావరుణోభాభిభర్మ్యహమీంద్రా గ్నీ అహమశ్వినోభా
అహం సోమమా హనసం భిభర్మ్యహం త్వష్టారముత పూషణం భగం అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే౩ యజమానాయ సున్వతే
అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం చికితుషీ ప్రథమా యజ్ఞయానాం తాం మా దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యావేశయంతీం
మయాసో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి య ఈం శృణోత్యుక్తం ఆమంతవో మాం త ఉపక్షియంతి శృధి శ్రుత శ్రద్ధివంతే వదామి
అహమేవ స్వయమిదం వదామి జుష్టం దేవేభిరుత మానుషేభిః యం కామయే తం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సుమేధాం
అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతవా ఉ అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావాపృథివీ ఆవివేశ
అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వంతః సముద్రే తతో వితిశ్ఠే భువనాను విశ్వోతామూం ద్యామ్ వర్ష్మణోపస్పృశామి
అహమేవ వాత ఇవ ప్రవామ్యారభమాణా భువనాని విశ్వా పరో దివా పర ఏనా పృథివ్యై తావతి మహినా సంబభూవ
(ఈ అభిషేక తీర్థమే నిర్మాల్య తీర్థము. దీనిని శంఖానికి, ప్రాణ, గరుడ, శేష, గురువులకు వారివారి అభిషేకము అయిన తరువాత ఉద్ధరణితో ఇవ్వవలెను)
నిర్మాల్య తీర్థమునుంచి కొంచెం బ్రహ్మ యజ్ఞానికి తీసి మిగిలిన తీర్థముతో శ్రీ సూక్తముతో శంఖానికి ఉద్ధరణితో అభిషేకము చెయ్యవలెను. ఇదే నిర్మాల్య తీర్థమునుంచి ప్రాణదేవునికి మరియు రాఘవేంద్రస్వామికి అభిషేకము చెయ్యవలెను. శుద్ధజలముతో శంఖాదులకు అభిషేకము చేసి నిర్మాల్యతీర్థమును మూడుసార్లు ఇవ్వడము కూడా ఉన్నది)
శ్రీ సూక్తం (శంఖానికి అభిషేకము)
ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ అవహ
తాం మ అవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మా యాంతరా యాశ్చ బాహ్యా అలక్ష్మీః
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం
ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహం ఓం
(లక్ష్మీ ప్రతిమకు శంఖానికి నిర్మాల్య తీర్థము ఇవ్వవలెను)
బళిత్థాసూక్తము (ప్రాణదేవునికి అభిషేకము)
ఓం బళిత్థా తద్వపుషే ధాయి దర్శతం దేవస్య భర్గః సహసో యతో జని
యదీముపహ్వరతే సాధతే మతిఋతస్య ధేనా అనయంత సస్రుతః
పృక్షో వపుః పితుమాన్ నిత్య ఆశయే ద్వితీయ మా సప్తశివాసు మాతృషు
తృతీయమస్య వృషభస్య దోహసే దశప్రమతిం జనయంత యోషణః
నిర్యదీం బుధ్నాన్ మహిషస్య వర్పస ఈసానాసః శవసాక్రంత సూరయః
యదీమను ప్రదీవో మధ్వ ఆధవే గుహా సంతం మాతరిశ్వా మథాయతి
ప్రయత్పితుః పరమాన్నీయతే పర్యా పృక్షుదో వీరుధోదంసు రోహతి
ఉభా యదస్య జనుషం యదిన్వత ఆదిద్యవిష్ఠో అభవద్ ఘృణా శుచిః
ఆదిన్మాత్రూరావిశద్యా స్వా శుచిరహింస్యమాన ఉర్వియావివావృధే
అను యత్పూర్వా అరుహత్ సనాజువో ని నవ్యసీష్వవరాసు ధావతే
(ప్రాణదేవుని అభిషేకము అయిన తరువాత ఈ తీర్థమును పంచపాత్రలో తీసిపెట్టుకొని నిర్మాల్య తీర్థమును ఇవ్వవలెను. దేవుని తీర్థము తీసుకొన్న తరువాత ప్రాణదేవుని తీర్థము (ఒక్కసారి) తీసుకొనవలెను)
శ్రీ రాఘవేంద్ర స్తోత్రము (రాఘవేంద్రస్వామికి అభిషేకము)
శ్రి పూర్ణభోదగురుతీర్థ పయోబ్దిపారా …………….
అథ షోడశోపచారాది మహాపూజా
మంటపధ్యానం
ఓం ఉత్తప్తోజ్వలకాంచనేన రచితం తుంగాంగరంగస్థలం
శుద్ధస్ఫాటిక భిత్తికా విలసితైః స్తంభైశ్చ హేమైశుభైః
ద్వారైశ్చామర రత్నరాజ ఖచితైః శోభావహం మండితైః
తత్రాన్యైరపి శంఖపద్మ ధవలైః ప్రభ్రాజితం స్వస్తికైః
ముక్తజాల విలంబి మంటపయుతం వజ్రైశ్చ సోపానకైః
నానారత్న వినిర్మితైశ్చ కలశైరత్యంత శోభావహం
మాణిక్యోజ్వల దీప దీప్తి విలసల్లక్ష్మీ విలాసాస్పదం
ధ్యాయేన్మంటపమర్చనేషు సకలైరేవంవిధైః సాధకైః
సమ్మార్జనై రంగవల్లీ ధ్వజకేతక తోరణైః
ఏతానైరిక్షుకదలీ పూర్ణకుంభాంకురాదిభిః
గీతావాదిత్ర నృతైశ్చ పురాణపఠనైః శుభైః
శొభమానం మహాపుణ్యం వర్ధమానం మనోహరం
ఓం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రతమం కవీనాం నఋతే త్వత్ క్రియతే కించనారే మహామర్కం మఘవన్ చిత్రమర్చ.
ఆరాధ్యసే ప్రాణభృతాం ప్రణేత్రా ప్రాణాధినాథేన సమీరణేన నారాయణ జ్ఞానసుఖైకపూర్ణ స్వామిన్ మయి శ్రీ రమణ ప్రసీద
బింబోఽసి ప్రతిబింబోఽస్మి తవ యద్యపి చాంతరం
స్వామిన్ నిర్దోష మద్దోషం విరేచయ నమోఽస్తుతే
భగవన్ యన్ మయా కర్మ శుభం కారయసే ప్రభో
తత్ సర్వం విష్ణుపూజాస్తు తవ దేవ ప్రసాదతః
ఆచమనము, ప్రాణాయామము, సంకల్పము
శుభే శోభనే ముహూర్తే విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశితితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే చాంద్రమానేన ——— సంవత్సరే —– ఆయనే —- ఋతౌ —- మాసే —- పక్షే —- తిథౌ —- వాసరయుక్తాయాం —- నక్షత్ర —- యోగ —– కరణ ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ అమ ఆత్మనః శృతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం జ్ఞాతాజ్ఞాత దోష పరిహారార్థం అస్యాం మహానద్యాం శాలగ్రామ చక్రాంకిత సన్నిధౌ బ్రాహ్మణ సన్నిధౌ భాగీరథ్యాది సార్ధత్రికోట దేవతా సన్నిధౌ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భగవతో వీర్యేణ భగవతో బలేన భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతా ప్రేరితోహం భగవతో లక్ష్మీనారాయణస్య యథామిలితోపచారద్రవ్యైః ధానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(ఈ సంకల్పము నీళ్ళున్న పాత్రను ముట్టి లేక ఎడమచేతి పైన కుడిచేతినుంచి కుడితొడ పైన పెట్టుకొని చెయ్యవలెను)
అథ కలశ పూజా
(ఒక తట్టలో ౫ లేదా ౨ కలశములను పెట్టి, గంధోదకము-స్వాదూదకములు వేసి కలశముల నాల్గు దిక్కులకూ గంధాక్షత పెట్టి, తుళసీదళము వేసి పూజించవలెను)
ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే (ఈ మంత్రముతో కలశములలో తుళసీదళము వెయ్యవలెను)
(తరువాత స్నానీయ కలశమును స్పర్శించి ఈరీతి పఠించాలి)
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతు సాగరాః సప్త సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశం తు సమాశ్రితాః
అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారకాః
సర్వే సముద్రాః సరితస్తీర్థాని జలదా నదాః
ఆయాంతు దేవపూజార్థం అభిషేకార్థమాదరాత్
గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఓం ఇమం మే గంగే యమునే సరస్వతీ శతుద్రిస్తోమం సచతా పరుష్ణ్యా అసిక్న్యా మరుధ్వృదే వితస్తయార్జికీయే శృణుహ్యా సుషోమయా
నిర్వీషీకరణార్థం తాక్ష్యముద్రాం ప్రదర్శయామి
అమృతీకరణార్థం ధేనుముద్రాం ప్రదర్శయామి
పవిత్రీకరణార్థం శంఖముద్రాం ప్రదర్శయామి
దిగ్బంధనార్థం గదాముద్రాం ప్రదర్శయామి
సంరక్షణార్థం చక్రముద్రాం ప్రదర్శయామి
స్నానీయ కలశే అజాది శతకలా సహితం శ్రీ లక్ష్మీనారాయణం సూర్యమండలాదావాహయామి పూర్ణకుంభే శింశుమారాది శతకలా సహితం శ్రీ లక్ష్మీనారాయణం సూర్యమండలాదావాహయామి
ఓం ఓం నమో నారాయణాయ ఓం ( ౧౨ సార్లు జపించాలి కలశమును ముట్టి)
ఆవాహిత కలశ దేవతాభ్యోం నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి మధుపర్కం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణాని సమర్పయామి గంధాక్షతాన్ సమర్పయామి తుళసీపుష్పాణి సమర్పయామి ధూపం ఆఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి ఆర్తిక్యం దర్శయామి మంత్రపుష్పం సమర్పయామి (ఉద్ధరణితో ప్రతిసారి నీళ్ళు వదలాలి)
సర్వక్షేత్ర మయో యస్మాత్ సర్వతీర్థ మయో యతః
అతో హరిప్రియోసి త్వం పూర్ణకుంభ నమోస్తు తే
అనేన కలశ దేవతారాధనేన భగవాన్ లక్ష్మీనారాయణః ప్రియతాం
అథ శంఖపూజా
(పూజచేసిన ప్రత్యేకమైన కలశోదకముతో శంఖమును నింపి, తుళసీదళమును ఉంచి గంధాక్షత పెట్టి గరుడముద్రాదులను చూపించి ప్రార్థించవలెను)
త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే
నమితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే
శంఖాదౌ చంద్ర దైవత్యం మధ్యే వరుణ దైవతం
పృష్ఠే ప్రజాపతిం విద్యాద్ అగ్రే గంగా సరస్వతీ
త్రైలోక్యే యాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా
శంఖేతిష్ఠంతి విప్రేంద్ర తస్మాచ్ఛంఖం ప్రపూజయేత్
ఓం పాంచజన్యాయ విద్మహే మహాదరాయ ధీమహి తన్నః శంఖః ప్రచోదయాత్ (శంఖమును ముట్టి మూడు సార్లు చెప్పవలెను)
శంఖ దేవతాభ్యో నమః ధ్యానం సమర్పయామి ఆసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి మధుపర్కం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి ఆభరణాని సమర్పయామి గంధాక్షతాన్ సమర్పయామి తుళసీపుష్పాణి సమర్పయామి ధూపం ఆఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి ఆర్తిక్యం దర్శయామి మంత్రపుష్పం సమర్పయామి
అనేన శంఖ పూజనేన భగవాన్ లక్ష్మీనారాయణః ప్రియతాం
పీఠపూజ
ఓం విష్ణోరాసన భూతాయ దివ్యరత్న మయాయ చ ! ప్రధాన పురుషేశాయ మహాపీఠాయ తే నమః
షోడశోపచార పూజా
ఓం నారాయణాయ ధ్యానం సమర్పయామి, లక్ష్మీ హస్తేన అర్ఘ్యం సమర్పయామి, సరస్వతీ హస్తేన పాద్యం సమర్పయామి, రతి హస్తేన ఆచమనీయం సమర్పయామి, పితామహ హస్తేన మధుపర్కం సమర్పయామి, శాంతి హస్తేన పునరాచమనం సమర్పయామి, వరుణ హస్తేన స్నానీయం సమర్పయామి
(నంతరము పురుషసూక్తం పఠించుచూ శాలగ్రామము, చక్రాంకితము, సుదర్శనము, విష్ణుపాదము, ప్రతిమలకు కలశోదకముతో శంఖముతో అభిషేకము చెయ్యవలెను, ఇదే దేవుని తీర్థము)
ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షస్సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం
పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్ఛభవ్యం ఉతామృతత్వస్యేశానో యదన్నేనాతిరోహతి
ఏతావానస్య మహిమాఽతో జ్యాయాంశ్చ పూరుషః పాదోఽస్య విశ్వా భూతాని త్రిపాదాస్యామృతం దివి
త్రిపాదూర్ధ్వ ఉదైత్ పురుషః పాదోఽస్యేహాభవత్ పునః తతో విష్వౙ్ వ్యక్రామత్ సాశనానశనే అభి
తస్మాద్విరాడజాయత విరాజో అధి పూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః
యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే
తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూంస్తాంశ్చక్రే వాయవ్యానారణ్యాన్ గ్రామ్యాశ్చ యే
తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ఋచస్సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత
తస్మా దశ్వా అజాయంత యే కే చోభయాదతః గావో హ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః
యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కా ఊరూ పాదా ఉచ్యేతే
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత
చంద్రమా మనసో జాతశ్చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత
నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణో ద్యౌస్సమవర్తత పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ తతా లోకాం అకల్పయన్
సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవా యద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః
(అభిషేకము చేసిన తరువాత శాలగ్రామములకు తుళసీ అర్పించాలి. శాలగ్రామములను వస్త్రముతో తుడుపరాదు, ప్రతిమలను తుడుపవచ్చు)
ఓం నమో నారాయణాయ మహాభిషేక స్నానం సమర్పయామి వస్త్రయుగం సమర్పయామి కౌస్తుభాద్యాభరణాని సమర్పయామి చక్రాద్యాయుధాని సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధాన్ సమర్పయామి అక్షతాన్ సమర్పయామి తుళసీదళ సహిత దూర్వాది నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి
(నంతరము కేశవాది చతుర్వింశతి నామములతో తుళసిదళాల్ని సమర్పించాలి)
ధూపం
వనస్పత్యుద్భవో దివ్యో గంధాడ్యో గంధ ఉత్తమ
అఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం
ఓం నమో నారాయణాయ ధూపం సమర్పయామి
దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహ
ఓం నమో నారాయణాయ దీపం సమర్పయామి
నైవేద్యం
(దేవునికెదురుగా కుడిపక్క నేలమును శుభ్రముచేసి రెండు మండలములు చేసి రంగవల్లితో శ్రీకారము లేదా ఓంకారము గీచి ఒకదాంట్లో అన్నము మొదలైన వంట పదార్థములను ఉంచి, మరొక్కదాంట్లో పాలు,పండ్లు, తాంబూలము మొదలైనవి ఉంచాలి. తుళసీదళముతో నెయ్యితో అభిఘారము చేసి, తుళసీదళములను వేసి యథాశక్తి ద్వాదశ స్తోత్రమును పఠించవలెను)
నంతరము శంఖములో నీళ్ళు నింపి ఓం నమో నారాయణాయ ఓం అని ఎనిమిది సార్లు అభిమంత్రించి తార్క్ష్యాది ముద్రములను శంఖానికి చూపించి – ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని నైవేద్యమునకు ప్రోక్షించవలెను
ఓం అమృతీకరణార్థం ధేనుముద్రాం ప్రదర్శయామి ఓం పవిత్రీకరణార్థం శంఖముద్రాం ప్రదర్శయామి సంరక్షణార్థం చక్రముద్రాం ప్రదర్శయామి ఓం నిర్వీషీకరణార్థం తార్క్ష్యముద్రాం ప్రదర్శయామి దిగ్బంధనార్థం గదాముద్రాం ప్రదర్శయామి
ఓం సత్యం త్వర్తేన పరిషించామి (అని శంఖపు నీటితో నైవేద్యము చుట్టూ నీళ్ళను పరిషేచిసి) ఓం అమృతోపస్తరణమసి స్వాహా మహాలక్ష్మీ సమేతస్య విష్ణో తే దక్షిణే కరే అపోశనం దియమానం పిబదేవ రమాపతే (అని శంఖముతో ఆపోశనము ఇచ్చి అర్ఘ్యపాత్రలో వేసి మళ్ళీ నీళ్ళు నింపుకొని)
ఓం ప్రాణాయ స్వాహా శ్రీ అనిరుద్ధాయ ఇదం న మమ
ఓం అపానాయ స్వాహా శ్రీ ప్రద్యుమ్నాయ ఇదం న మమ
ఓం వ్యానాయ స్వాహా శ్రీ సంకర్షణాయ ఇదం న మమ
ఓం ఉదానాయ స్వాహా శ్రీ వాసుదేవాయ ఇదం న మమ
ఓం సమానాయ స్వాహా శ్రీ నారాయణాయ ఇదం న మమ
శ్రీనివాస నమస్తుభ్యం మహా నైవేద్య ముత్తమం
నిత్యతృప్త గృహాణేదం కృపయా భక్తవత్సల
శ్రీ నారాయణాయ నైవేద్యం సమర్పయామి (అని శంఖముతో అర్ఘ్యోదకము సమర్పించి నంతరము తుళసీదళము చేతిలోపట్టుకొని ప్రార్థించాలి)
మధ్యే పానీయం సమర్పయామి
(కళ్ళు మూసుకొని “ఓం నమో నారాయణాయ” అని ౧౦౮ లేదా ౧౨ సార్లు జపించి)
ఓం అమృతాపిధానమసి స్వాహా ఉత్తరాపోషనం సమర్పయామి హస్తప్రక్షాలనం సమర్పయామి గండూషం సమర్పయామి ముఖవస్త్రం సమర్పయామి పూగీఫల తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పం సమర్పయామి (అని ప్రతి సమర్పణకు దేవుని ఎడమపక్క వేరే పాత్ర పెట్టి దానిలో నీళ్ళు వదలాలి)
మహామంగళారతి
ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత
అర్చంతు పుత్రకా ఉత పురం న ధృష్ణ్వర్చత
శ్రియే జాతః శ్రియ అనిరియాయ శ్రియం వయో జరితృభ్యోదధాతి
శ్రియం వసానా అమృతత్వమాయన్ భవంతి సత్యా సమిథా మితద్రౌ
శ్రియ ఏవైనం తచ్ఛ్రియమాదధాతి సంతతమృచా వషట్ కృత్యం సంతతై సంధీయతే ప్రజయా పశుభిర్య ఏవం వేద
కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే
శ్రిమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః
మంత్రపుష్పం
(అనంతరం చేతిలో పూలు తుళసి అక్షతగింజలను పట్టుకొని)
ఓం నమో మహాద్భ్యో నమో ఆర్భకేభ్యో నమో యువేభ్యో నమ ఆశినేభ్యః యజామదేవాన్ యది శక్నవామ మా జ్యాయసః శంసమా వృక్షి దేవాః
రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వైశ్రవణాయ కుర్మహే స మే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః
తాసామావిరభూచ్ఛౌరిః స్వయమాన ముఖాంబుజః
పీతాంబరదరః స్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మథః
ఓం నమో నారాయణాయ మంత్రపుష్పం సమర్పయామి ఛత్రం సమర్పయామి చామరం సమర్పయామి వ్యజనం సమర్పయామి దర్పణం సమర్పయామి గీతం సమర్పయామి నృత్యం సమర్పయామి వాద్యం సమర్పయామి స్తోత్రం సమర్పయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి
(అని అర్పించాలి)
శంఖభ్రమణం
(శంఖములో శుద్ధమైననీళ్ళు వేసుకొని క్రింది మంత్రముతో దేవుని పాదమునుంచి కిరీటము పర్యంతము, రెండవసారి నాభినుంచి కిరీటము పర్యంతము, మూడవ సారి హృదయమునుంచి కిరీటము పర్యంతము, ఈ విధముగా మూడుసార్లు ప్రదిక్షిణాకారము చేసి పాత్రకు ఈ నీళ్ళను వేసుకొనవలెను. ఇదే తీర్థానికి ముందు ప్రోక్షణకు ఉపయోగించు శంఖ తీర్థము)
ఓం ఇమా ఆపః శివతమా ఇమా సర్వస్య భేషజీః
ఇమా రాష్ట్రస్య వర్ధనీరిమా రాష్ట్రభృతోఽమృతా
(అనంతరం రమా, బ్రహ్మ, వాయువులకు నమస్కరించి మూడుసార్లు తీర్థము ఇచ్చి నిర్మాల్యము, గంధము, తుళసీ, పుష్పములను సమర్పించవలెను. రమాదేవికి పసుపు కుంకుమ సమర్పించవలెను. దేవుని నైవేద్యములో వైశ్వదేవునికోసం ఒక భాగము తీసిపెట్టి మిగిలినదాన్ని రమాదేవికీ, వాయుదేవునికీ అర్పించాలి. గరుడాదిదేవతలకు వేరే తీసిపెట్టి సమర్పించవలెను)
రమా బ్రహ్మదయో దేవాః సనకాద్యాః శుకాదయః
శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాః
సమాపనం :
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే
యత్ కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే
అనేన షోడశోపచార పూజనేన భగవాన్ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం ప్రీతో వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు.
(ఉద్ధరిణితో నీళ్ళను వదిలి రెండు సార్లు ఆచమనము చెయ్యవలెను)
మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ లోపదోష ప్రాయశ్చిత్తార్థం నామత్రయమంత్రజపం కరిష్యే
అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః (మూడు సార్లు) అచ్యుతానంతగోవిందేభ్యో నమః
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత్ స్వభావం
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి
Download Link
Good
Can you post this in English also please?
Very nicely presented. Kindly add Hastodaka and Vaiswadeva and Baliharana paddhati also.
Vaiswadeva is included now in both telugu and kannada