Yajur Veda Pratha Sandhavandavna Telugu
యజుర్వేదీయ ప్రాతః సంధ్యావందనం
అచమనం:
ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా
(మూడు సార్లు పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్ళను ఉద్దరణితో కుడి చేతిలో వేసుకొని ప్రాశనం చెయ్యవలెను)
ఓం గోవిందాయ నమః – ఓం విష్ణవే నమః – ఓం మధుసూదనాయ నమః – ఓం త్రివిక్రమాయ నమః – ఓం వామనాయ నమః – ఓం శ్రీధరాయ నమః – ఓం హృషీకేశాయ నమః – ఓం పద్మనాభాయ నమః – ఓం దామోదరాయ నమః – ఓం సంకర్షణాయ నమః – ఓం వాసుదేవాయ నమః – ఓం ప్రద్యుమ్నాయ నమః – ఓం అనిరుద్ధాయ నమః – ఓం పురుషోత్తమాయ నమః – ఓం అధోక్షజాయ నమః – ఓం నారసింహాయ నమః – ఓం అచ్యుతాయ నమః – ఓం జనార్దనాయ నమః – ఓం ఉపేంద్రాయ నమః – ఓం హరయే నమః – ఓం శ్రీ కృష్ణాయ నమః
ప్రాణాయామః :
ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీఛందః ప్రాణాయామే వినియోగః
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !! ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
సంకల్ప :
శుభే శొభనే ముహూర్తే విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశితితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే చాంద్రమానేన ——— సంవత్సరే —– ఆయనే —- ఋతౌ —- మాసే —- పక్షే —- తిథౌ —- వాసరయుక్తాయాం —- నక్షత్ర —- యోగ —– కరణ ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాముపాసిష్యే
(ఈ సంకల్పము నీళ్ళున్న పాత్రను ముట్టి లేక ఎడమచేతి పైన కుడిచేతినుంచి కుడితొడ పైన పెట్టుకొని చెయ్యవలెను)
మార్జనం :
(ఎడమచేతిలో ఉద్ధరణెతో నీళ్ళు పట్టుకొని తుళసీదళముతో పాదము-శిరస్సు-హృదయము, హృదయము-పాదము-శిరస్సు, శిరస్సు-హృదయము-పాదము, ఈక్రమముగా ప్రోక్షణము చేసుకొనవలెను. ఈ మార్జనముతో దేహ శుద్ధి అగును)
ఓం ఆపో హిష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే !! ౧ !!
యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః !! ౨ !!
తస్మా అరంగమామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః !! ౩ !!
జలాభిమంత్రణం :
(కుడిచేతిలో ఉద్దిగింజ మునిగేటంత నీళ్ళు పట్టుకొని క్రింది మంత్రముతో ప్రార్థన చేసి ప్రాశనం చెయ్యవలెను)
ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా ! ఓం
పునర్మార్జనం :
ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖా కరత్ప్రణ ఆయూగ్ంషి తారిషత్ !! ౧ !!
ఓం ఆపో హిష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః !! ౨ !!
హిరణ్యవర్ణాః శుచయః పావకా యాసు జాతః కశ్యపో యాస్వీంద్రః అగ్నిం యా గర్భం దధిరే విరూపాస్తా న ఆపః శంస్యోనా భవంతు !! ౩ !!
యాసాం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యన్ జనానాం. మధుశ్చుతః శుచయో యాః పావకాస్తా న ఆపః శంస్యోనా భవంతు !! ౪ !!
యాసాం దేవా దివికృణ్వంతి భక్షం అంతరిక్షే బహుధా భవంతి యాః పృథ్వీం పయసోందంతి శుక్రాస్తా న ఆపః శంస్యోనా భవంతు !! ౫ !!
అఘమర్షణం :
(కుడి చేతిలో నీళ్ళు వేసికొని ఈ క్రింది మంత్రము చెప్పి నీళ్ళను మూసి చూసి ఈశాన్య దిక్కుకు చెల్లి పాపపురుషుని విసర్జనము అయినదని భావించవలెను)
ఓం శివేన మా చక్షుషా పశ్యాతాఽపః శివయా తనువోపస్పృశత త్వచం మే. సర్వాం అగ్నీంరప్సుషదో హువే వో మయి వర్చో బలమోజో ని ధత్త !! ౧ !!
ద్రుపదాదివ ముంచంతు !! ౨ !! (ఈశాన్యాభిముఖముగా విసర్జించవలెను)
ద్రుపదాదివేన్ ముముచానః స్విన్నః స్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణైవాజ్యం ఆపః శుంధంతు మైనసః !! ౩ !! (మరొక్కసారి నీళ్ళను మూసి చూసి ఎడభాగమునందు విసర్జించవలెను)
(అనంతరము రెండుసార్లు ఆచమనము చెయ్యవలెను)
అర్ఘ్యప్రదానం :
మొదట ప్రాణాయామము చెయ్యవలెను
ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీఛందః ప్రాణాయామే వినియోగః
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !! ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
పూర్వోక్తైవంగుణ విషేషణవిశిష్టాయాం శుభతిథౌ మమ ఆత్మనః శృతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం జ్ఞాతాజ్ఞాత దోష పరిహారార్థం అస్యాం మహానద్యాం శాలగ్రామ చక్రాంకిత సన్నిధౌ బ్రాహ్మణ సన్నిధౌ భాగీరథ్యాది సార్ధత్రికోట దేవతా సన్నిధౌ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాంగ సూర్యార్ఘ్య ప్రదానమహం కరిష్యే.
విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః ప్రాతరర్ఘ్యప్రదానే వినియోగః
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ( ఈ రీతిగా మూడు సార్లు అర్ఘ్యము ఇవ్వవలెను)
(అర్ఘ్యమును సూర్యాభిముఖముగా లేచి నిలబడి రెండుచేతులలో నీళ్ళను నింపి ఇవ్వవలెను. ఆచమనము చేసిన నీటితో అర్ఘ్యమును ఇవ్వరాదు, శుద్ధజలముతో ఇవ్వవలెను. సాయంకాలము పశ్చిమాభిముఖముగా కూర్చొని ఇవ్వవలెను)
ప్రాయశ్చిత్తార్ఘ్యం :
(సకాలమున అర్ఘ్యప్రదానము చేయనియెడల ప్రాయశ్చిత్తార్థముగా నాలుగవ అర్ఘ్యము ఇవ్వవలెను.)
కాలాతీతదోష ప్రాయశ్చిత్తార్థం చతుర్థార్ఘ్యప్రదానమహం కరిష్యే.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
(అని అర్ఘ్యము ఇవ్వవలెను)
ఉత్తిష్ఠోత్తిష్ఠ గంతవ్యం పునరాగమనాయచ
ఉత్తిష్టదేవి స్థాతవ్యం ప్రవిశ్య హృదయం మమ (ఎదని ముట్టుకొనవలెను)
ఓం ఆసావాదిత్యో బ్రహ్మ (చేతిలో నీళ్ళు పట్టుకొని ఆత్మ ప్రదిక్షణం చేస్తూ చుట్టూ నీళ్ళు చల్లాలి)
(తరువాత రెండు సార్లు ఆచమనము చేసి, కుడిచేతి వేళ్ళకొననుండి శుద్ధమైన నీటితో తర్పణము ఇవ్వవలెను)
ఓం కేశవం తర్పయామి ……….. ఓం దామోదరం తర్పయామి (శుక్ల పక్షములో)
ఓం సంకర్షణం తర్పయామి ……….. ఓం శ్రీకృష్ణం తర్పయామి (కృష్ణ పక్షములో)
భూతోచ్చాటనం :
Download
Can we have one in Tamil? (or english)