RigVeda PrathaSandhyavandane Telugu

ఋగ్వేదీయ ప్రాతః సంధ్యావందనం
అచమనం:
ఓం కేశవాయ స్వాహా – ఓం నారాయణాయ స్వాహా – ఓం మాధవాయ స్వాహా
(మూడు సార్లు పంచపాత్రలో ఉన్నటువంటి నీళ్ళను ఉద్దరణితో కుడి చేతిలో వేసుకొని ప్రాశనం చెయ్యవలెను)
ఓం గోవిందాయ నమః – ఓం విష్ణవే నమః – ఓం మధుసూదనాయ నమః – ఓం త్రివిక్రమాయ నమః – ఓం వామనాయ నమః – ఓం శ్రీధరాయ నమః – ఓం హృషీకేశాయ నమః – ఓం పద్మనాభాయ నమః – ఓం దామోదరాయ నమః – ఓం సంకర్షణాయ నమః – ఓం వాసుదేవాయ నమః – ఓం ప్రద్యుమ్నాయ నమః – ఓం అనిరుద్ధాయ నమః – ఓం పురుషోత్తమాయ నమః – ఓం అధోక్షజాయ నమః – ఓం నారసింహాయ నమః – ఓం అచ్యుతాయ నమః – ఓం జనార్దనాయ నమః – ఓం ఉపేంద్రాయ నమః – ఓం హరయే నమః – ఓం శ్రీ కృష్ణాయ నమః
ప్రాణాయామః :
ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీఛందః ప్రాణాయామే వినియోగః
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !! ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
సంకల్పము :
శుభే శొభనే ముహూర్తే విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశితితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానే చాంద్రమానేన ——— సంవత్సరే —– ఆయనే —- ఋతౌ —- మాసే —- పక్షే —- తిథౌ —- వాసరయుక్తాయాం —- నక్షత్ర —- యోగ —– కరణ ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాముపాసిష్యే
  (ఈ సంకల్పము నీళ్ళున్న పాత్రను ముట్టి లేక ఎడమచేతి పైన కుడిచేతినుంచి కుడితొడ పైన పెట్టుకొని చెయ్యవలెను)
మార్జనం  :
(ఎడమచేతిలో ఉద్ధరణెతో నీళ్ళు పట్టుకొని తుళసీదళముతో పాదము-శిరస్సు-హృదయము, హృదయము-పాదము-శిరస్సు, శిరస్సు-హృదయము-పాదము, ఈక్రమముగా ప్రోక్షణము చేసుకొనవలెను. ఈ మార్జనముతో దేహ శుద్ధి అగును)
ఆపో హి ష్ఠేతి తృచస్య సూక్తస్య అంబరీష సింధుద్వీప ఋషిః గాయత్రీ ఛందః ఆపో దేవతా మార్జనే వినియోగః
ఓం ఆపో హిష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే  !! ౧ !!
యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః !! ౨ !!
తస్మా అరంగమామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః  !! ౩ !!
జలాభిమంత్రణం  :
(కుడిచేతిలో ఉద్దిగింజ మునిగేటంత నీళ్ళు పట్టుకొని క్రింది మంత్రముతో ప్రార్థన చేసి ప్రాశనం చెయ్యవలెను)
సూర్యశ్చేత్యశ్య మంత్రస్య నారాయణ ఋషిః సూర్యమామన్యు మన్యుపతయో రాత్రిర్దేవతా ప్రకృతిశ్చందః జలాభిమంత్రణే వినియోగః
ఓం సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మామమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా ! ఓం
పునర్మార్జనం :
ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య అంబరీష సింధుద్వీప ఋషిః గాయత్రీ ఛందః ఆపో దేవతా పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠా అంతే ద్వే అనుష్టుభౌ పునర్మార్జనే వినియోగః
ఓం ఆపో హిష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మహే రణాయ చక్షసే  !! ౧ !!
యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః !! ౨ !!
తస్మా అరంగమామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః  !! ౩ !!
ఓం శం నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శం యోరభిస్రవంతు నః !! ౪ !!
ఈశానా వార్యాణాం క్షయంతీశ్చర్షణీనాం ఆపో యాచామి భేషజం !! ౫ !!
అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా అగ్నిం చ విశ్వశంభువం !! ౬ !!
ఆపః పృణీత భేషజం వరూథం తన్వే౩మమ జ్యోక్చ సూర్యం దృశే !! ౭ !!
ఇదమాపః ప్రవహత యత్కించ దురితం మయి యద్వాహమభిదుద్రోహ యద్వాశేప ఉతానృతం !! ౮ !!
ఆపో అద్యాన్వచారిషం రసేన సమగస్మహి పయస్వానగ్న ఆగహి తం మా సంసృజ వర్చసా !! ౯ !!
సస్రుషీరీత్యస్య ఆపో దేవతా అనుష్టుప్ ఛందః మార్జనే వినియొగః
ఓం సస్రుషీస్తదపసో దివానక్తం చ సస్రుషీః వరేణ్యక్రతూరహమా దేవీరవసే హువే !! ౧౦ !!
అఘమర్షణం :
(కుడి చేతిలో నీళ్ళు వేసికొని ఈ క్రింది మంత్రము చెప్పి నీళ్ళను మూసి చూసి ఈశాన్య దిక్కుకు చెల్లి పాపపురుషుని విసర్జనము అయినదని భావించవలెను)
ఋతం చేత్యస్య సూక్తస్య అఘమర్షణ ఋషిః అనుష్టుప్ ఛందః భావవృత్తో దేవతా పాపపురుష విసర్జనే వినియోగః
ఓం ఋతంచ సత్యం చాభీద్ధాత్ తపసోఽధ్యజాయత
తతో రాత్ర్యజాయత తతః సముద్రో ఆర్ణవః
సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత
అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతొ వశీ
సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్
దివం చ పృథ్వీం చాంతరీక్షమథో స్వః
అర్ఘ్యప్రదానం :
మొదట ప్రాణాయామము చెయ్యవలెను
ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీఛందః ప్రాణాయామే వినియోగః
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ !! ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
పూర్వోక్తైవంగుణ విషేషణవిశిష్టాయాం శుభతిథౌ మమ ఆత్మనః శృతి స్మృతి పురాణోక్త ఫలప్రాప్త్యర్థం జ్ఞాతాజ్ఞాత దోష పరిహారార్థం అస్యాం మహానద్యాం శాలగ్రామ చక్రాంకిత సన్నిధౌ బ్రాహ్మణ సన్నిధౌ భాగీరథ్యాది సార్ధత్రికోట దేవతా సన్నిధౌ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాంగ సూర్యార్ఘ్య ప్రదానమహం కరిష్యే.
విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః ప్రాతరర్ఘ్యప్రదానే వినియోగః
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ( ఈ రీతిగా మూడు సార్లు అర్ఘ్యము ఇవ్వవలెను)
(అర్ఘ్యమును సూర్యాభిముఖముగా లేచి నిలబడి రెండుచేతులలో నీళ్ళను నింపి ఇవ్వవలెను. ఆచమనము చేసిన నీటితో అర్ఘ్యమును ఇవ్వరాదు, శుద్ధజలముతో ఇవ్వవలెను. సాయంకాలము పశ్చిమాభిముఖముగా కూర్చొని ఇవ్వవలెను)
ప్రాయశ్చిత్తార్ఘ్యం :
(సకాలమున అర్ఘ్యప్రదానము చేయనియెడల ప్రాయశ్చిత్తార్థముగా నాలుగవ అర్ఘ్యము ఇవ్వవలెను.)
కాలాతీతదోష ప్రాయశ్చిత్తార్థం చతుర్థార్ఘ్యప్రదానమహం కరిష్యే.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం
(అని అర్ఘ్యము ఇవ్వవలెను)
ఉత్తిష్ఠోత్తిష్ఠ గంతవ్యం పునరాగమనాయచ
ఉత్తిష్టదేవి స్థాతవ్యం ప్రవిశ్య హృదయం మమ  (ఎదని ముట్టుకొనవలెను)
ఓం ఆసావాదిత్యో బ్రహ్మ  (చేతిలో నీళ్ళు పట్టుకొని ఆత్మ ప్రదిక్షణం చేస్తూ చుట్టూ నీళ్ళు చల్లాలి)
(తరువాత రెండు సార్లు ఆచమనము చేసి, కుడిచేతి వేళ్ళకొననుండి శుద్ధమైన నీటితో తర్పణము ఇవ్వవలెను)
ఓం కేశవం తర్పయామి ……….. ఓం దామోదరం తర్పయామి (శుక్ల పక్షములో)
ఓం సంకర్షణం తర్పయామి ……….. ఓం శ్రీకృష్ణం తర్పయామి (కృష్ణ పక్షములో)
భూతోచ్చాటనం :
అపసర్పంత్విత్యస్య మంత్రస్య వామదేవ ఋషిః భూతాని దేవతాః అనుష్టుప్ ఛందః భూతోచ్చాటనే వినియోగః
ఓం అపసర్పంతు యే భూతా యే భూతా భువిసంస్థితాః
యే భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా
అపక్రామంతు తే భూతాః క్రూరాశ్చైవ తు రాక్షసాః
యే చాత్ర నివసంత్యేవ దైవతా భువి సంతతం
భూతప్రేతపిశాచా యే యే చాన్యే భువి భారకాః
తేషామప్య విరోధేన బ్రహ్మకర్మ సమారభే
నిరస్తః పరావసుః ఇదమహమర్వావసోః సదనే సీదామి
ఆసనే సోమమండలే కూర్మస్కంధే ఉపవిష్ఠోస్మి
ఓం భూర్భువఃస్వరోం అనంతాసనాయ నమః కూర్మాసనాయ నమః
ఆసనశుద్ధిః :
పృథ్వీతి మంత్రస్య మేరుపృష్ఠ ఋషిః కూర్మోదేవతా సుతలం ఛందః ఆసనే వినియొగః
పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీత్వం విష్ణునా ధృతా
త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం
మాం చ పూతం కురుధరే నతోస్మిత్వాం సురేశ్వరి.
గాయత్రీజపం : (మూడు సార్లు ప్రాణాయామము చెయ్యవలెను)
కరన్యాసము
ఓం తత్సవితురంగుష్ఠాభ్యాం నమః,  ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః,  ఓం భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః,  ఓం ధీమహి అనామికాభ్యాం నమః, ఓం ధీయో యో నః కనిష్ఠకాభ్యాం నమః,  ఓం ప్రచోదయాత్ కరతల కరపృష్ఠాభ్యాం నమః
(ఆరు మంత్రములతో క్రమముగా అంగుష్ఠ, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠికములను, ముంచేయి-అరచేతులను ముట్టుకొనవలెను)
అంగన్యాసము
ఓం తత్సవితుః హృదయాయ నమః,  ఓం వరేణ్యం శిరసే స్వాహా,  ఓం భర్గోదేవస్య శిఖాయై వౌషట్,  ఓం ధీమహి కవచాయ హుం, ఓం ధీయో యో నః నేత్రాభ్యాం వషట్,  ఓం ప్రచోదయాత్ అస్త్రాయ ఫట్, ఓం భూర్భువఃస్వరోం ఇతి దిగ్భందః
(ఆరు మంత్రములతో క్రమముగా హృదయము, శిరస్సు, శిఖ, భుజము, కన్నులను ముట్టి చిటిక వేయవలెను)
గాయత్ర్యాహ్వానము
అగచ్చవరదే దేవి జపే మే సన్నిధౌ భవ
గాయంతం త్రాయసే యస్మాత్ గాయత్రీ త్వం తతః స్మృతా
అస్య శ్రీ గాయత్రీ మహా మంత్రస్య విశ్వామిత్ర ఋషిః దైవీ గాయత్రీ ఛందః సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణో దేవతా శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియొగః
ధ్యాన
ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః
సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణయా సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మంత్రజపం కరిష్యే
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ (౧౦౦౦, ౧౦౦ లేక ౧౦ సార్లు జపించవలెను)
అనేన యథాశక్తి గాయత్రీ మంత్రజపేన భగవాన్ సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం శ్రీకృష్ణార్పణమస్తు.
(తరువాత అధికారము ఉన్నవారు జపించిన గాయత్రీ మంత్రానికి మూడు పట్టు నారాయణ అష్టాక్షర మంత్రమును జపించవలెను)
ఓం ఓం నమో నారాయణాయ ఓం (౩౦౦౦, ౩౦౦ లేక ౩౦ సార్లు జపించవలెను)
ఉపస్థానం  :
(సూర్యాభిముఖముగా నిలుచుకొని స్తుతించవలెను)
జాతవేదస ఇత్యస్య మంత్రస్య కశ్యప ఋషిః జాతవేదా అగ్నిర్దేవతా త్రిష్టుప్ ఛందః సంధ్యోపస్థానే వినియోగః
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః  స నః వర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః
తచ్ఛంయోః శంయుర్విశ్వేదేవాః శక్వరీ ఉపస్థానే వినియోగః
ఓం తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీః స్వస్తిరస్తు నః స్వస్తి ర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే
నమో బ్రహ్మణ ఇత్యస్య మంత్రస్య ప్రజాపతిర్విశ్వేదేవా జగతీ ప్రదక్షిణే వినియోగః
ఓం నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే మహతే కరోమి
(ఈ మంత్రముతో మూడుసార్లు ప్రదిక్షిణము చెయ్యవలెను)
ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (తూర్పు దిక్కుకు నమస్కారము)
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (దక్షిణ దిక్కుకు నమస్కారము)
ఓం నమః ప్రతీచ్యై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (పశ్చిమ దిక్కుకు నమస్కారము)
ఓం నమః ఉదీచ్యై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (ఉత్తర దిక్కుకు నమస్కారము)
ఓం నమః ఊర్ధ్వాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (పై దిక్కుకు నమస్కారము)
ఓం నమోఽధరాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః (క్రింది దిక్కుకు నమస్కారము)
ఓం నమః అంతరిక్షాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః
ఓం నమోఽవాంతరాయై దిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసంత్యేతాభ్యశ్చ నమో నమః
ఓం సంధ్యాయై నమః, ఓం సావిత్రై నమః, ఓం గాయత్రై నమః, ఓం సరస్వత్యై నమః, సర్వాభ్యో దేవతాభ్యో నమః ఋషిభ్యో నమః గురుభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః, ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం ఆచార్యేభ్యో నమః,
ఓం కామోఽకార్షీన్నమోనమః ఓం మన్యురకార్షీన్నమోనమః ఓం యాం సదా సర్వభూతాని స్థావరాణి చరాణి చ
సాయం ప్రాతర్నమస్యంతి సా మా సంధ్యాఽభి రక్షతు
సా మా సంధ్యా అభిరక్షతు ఓం నమో నమః
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః
బ్రహ్మణ్యః పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః
క్షీరేణ స్నాపితే దేవి చందనేన విలేపితే
బిల్వపత్రార్చతే దేవి దుర్గేఽహం శరణం గతః
శ్రీ దుర్గేఽహం శరణం గత ఓం నమో నమః
ఆకాశాత్ పతితం తోయం యథాగచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోం నమో నమః
గాయత్ర్యుద్వాసనం  :
ఉత్తమ ఇత్యస్య వామ దేవ ఋషిః గాయత్రీ దేవతా అనుష్టుప్ ఛందః గాయత్ర్యుద్వాసనే వినియోగః
ఓం ఉత్తమ శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని.
బ్రాహ్మణేభ్యోఽభ్యనుజ్ఞాతా గచ్ఛ దేవి యథా సుఖం శ్రీ గచ్ఛ దేవి యథా సుఖమోం నమో నమః
సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం
తత్ ఫలమ్ సమ వాప్నోతి స్తుత్వా దేవం జనార్ధనం
వాసనాద్వాసుదేవోఽసి వాసితం తే జగత్త్రయం
సర్వభూత నివాసోఽసి వాసుదేవ నమోస్తుతే
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః
గోత్రాభివాదనం  :
ఓం భద్రం నో అపి వాతయ మనః,  ఓం శాంతిః శాంతిః శాంతిః సర్వారిష్ట శాంతిరస్తు, సమస్త మంగళావాప్తిరస్తు చతుఃసాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు
………. ప్రవరాన్విత …….. గోత్రోత్పన్నః ఋగ్వేదస్య అశ్వలాయన సూత్ర శాకల్య శాఖాధ్యాయీ ……. శర్మాహం భో అభివాదయే
(కుడి చేతితో కుడి చెవిని, ఎడమ చేతితో ఎడమ చెవిని పట్టుకొని వారి వారి ప్రవరము, గోత్రము మరియు పేర్లను ఉచ్చరించి ఆయా కాళ్ళను స్పర్శించవలెను)
సమాపనం  :
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః సంధ్యాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే
యత్ కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే
అనేన ప్రాతః సంధ్యావందనేన భగవాన్ భారతీరమణముఖ్యప్రాణాంతర్గత సవితృనామక శ్రీ లక్ష్మీనారాయణ ప్రియతాం ప్రీతో వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు.
(ఉద్ధరిణితో నీళ్ళను వదిలి రెండు సార్లు ఆచమనము చెయ్యవలెను)
మధ్యే మంత్ర తంత్ర స్వర వర్ణ లోపదోష ప్రాయశ్చిత్తార్థం నామత్రయమంత్రజపం కరిష్యే
అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః (మూడు సార్లు) అచ్యుతానంతగోవిందేభ్యో నమః
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత్ స్వభావం
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి

madhwamrutha

Tenets of Madhwa Shastra

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *